అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు

అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్ టన్ లోని వైట్ హౌస్ లో ఇండియన్ సాంగ్ సారే జహాసే అచ్ఛా రెండవ సారి ఆలపించారు. మొదటిసారిగా జూన్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అప్పుడు ఈ పాట పాడారు. అంతేకాదు.. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ సమోసా, పానీపూరీ కూడా వడ్డించారు. ఇంతకీ ఆ సందర్భమేంటో తెలుసుకుందాం..

ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ ఐలాండర్ లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పడి మే 14నాటికి 25 సంవ్సరాలు అయిన సందర్భంగా అమెరికా వైట్ హౌస్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత స్వాతంత్రోద్యమం సమయంలో మహమ్మద్ ఇక్బాల్ రచించిన దేశభక్తి గేయం సారే జహాసే అచ్ఛా వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ ట్రూప్ పాడుతూ వాయించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

ఇండియన్ వంటకాలైన సమోసాను, పానీపూరీ వడ్డించారు. జో బైడెన్ హాజరై, మాట్లాడుతూ.. వందల ఏళ్ల క్రితం ఆసియా నుంచి వచ్చిన వారికి వాహయియన్లు తమ భూములు ఇచ్చారని దీంతో వారంతా ఇక్కడే స్థిరపడ్డారని అన్నారు. అమెరికా అభివృద్ధి ఆసియన్లది కీలక పాత్రని కొనియాడారు.